వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ | 11వ రౌండ్లో గుకేశ్ విజయం..
- December 08, 2024
సింగపూర్: ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డ్రాల పర్వానికి తెరపడింది.వరుసగా ఏడు డ్రా గేమ్‌ల తర్వాత ఫలితం దక్కింది.ఈ రోజు జరిగిన 11వ రౌండ్లో భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్ డిఫెండింగ్ ఛాంపియన్, చైనీస్ చెస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ పై విజయం సాధించాడు.
ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న ఈ ప్రపంచ మ్యాచ్‌లో గుకేశ్ 6 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు.లిరెన్ 5 పాయింట్లతో ఉన్నాడు.
కాగా, 14 రౌండ్లు ఉండే ఈ ప్రపంచ మ్యాచ్‌లో తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. తొలి మ్యాచ్‌లో లిరెన్ విజయం సాధించగా..రెండో గేమ్ డ్రాగా ముగిసింది. గుకేశ్ మూడో గేమ్‌లో గెలుపొంది లిరెన్‌ను సమం చేశాడు.తర్వాత జరిగిన ఏడు గేమ్‌లు హోరాహోరీగా సాగినా చివరకు డ్రాగా ముగిశాయి.11వ గేమ్‌లో ఫలితం తేలడంతో డ్రాల పర్వానికి తెరపడింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







