వాట్సాప్‌లో 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్-ఇది ఎలా పనిచేస్తుందంటే..?
- December 08, 2024
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది.ఇది మర్చిపోయిన మెసేజ్‌లను గుర్తుచేసేందుకు ఉపయోగపడనుంది. 'మెసెజ్ రిమైండర్స్' పేరుతో దీన్ని తీసుకురానున్నారు.
ఈ ఫీచర్ ఉపయోగాలివే..!:
ప్రస్తుతం వాట్సాప్ లేని మొబైల్ లేదంటే అతిశయోక్తి కాదు. మెసెజ్, ఫొటోలు, వీడియోలు షేర్ చేసేందుకు అంతా వాట్సాప్‌నే వినియోగిస్తున్నారు.దీంతో వాట్సాప్‌లో పెద్ద ఎత్తున మెసెజెస్ వచ్చి చేరుతుంటాయి.అయితే కొన్ని సందర్భాల్లో మనకు సమయంలేక కొన్ని మెజెస్లను చదవకుండా అలానే వదిలేస్తుంటాం.కొన్ని మెసెజ్‌లను మాత్రమే ఓపెన్ చేస్తాం.చదివే తీరిక లేక మరికొన్నింటిని తర్వాత చదువుదాంలే అనుకుని మర్చిపోతుంటాం.దీంతో కొన్ని చాట్స్ మరుగున పడిపోతుంటాయి.అలా వదిలేసిన చాట్లను రిమైండ్ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఇది ఎలా పనిచేస్తుందంటే?
ఈ కొత్త వాట్సాప్ 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్ కొన్ని స్పెసిఫిక్ కాంటాక్ట్స్ నుంచి వచ్చిన అన్‌రీడ్ మెసెజ్‌లపై అలెర్ట్స్ పంపిస్తుంది. మనం తరచుగా ఎవరితో చాట్ చేస్తున్నామో ఆ కాంటాక్ట్స్ లిస్ట్ ఆధారంగా ఇంటర్నల్ ఆల్గరిథమ్ మనకు ఈ నోటిఫికేషన్లను పంపిస్తుంది. అంటే మనం ఎక్కువగా చాట్ చేస్తున్న కాంటాక్ట్స్ నుంచి వచ్చిన మెసెజ్‌లను మధ్యలో కొన్ని చాట్స్ కారణంగా మర్చిపోతే ఈ ఫీచర్ మనకు గుర్తుచేస్తుందన్నమాట.
ఈ 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్‌ను దాని ప్రీవియస్ అప్డేట్ నుంచి డెవలప్ చేశారు.గతంలో ఈ ఫీచర్ స్టేటస్ అప్‌డేట్స్ రిమైండింగ్ కోసం మాత్రమే నోటిఫికేషన్లను అందించేది.అయితే తాజాగా చాట్‌లలో చదవని మెసెజ్‌లను ట్రాక్ చేయడంలో ఇది మీకు సాయం చేస్తుంది.
అందుబాటులోకి ఎప్పుడు? ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. దీంతో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది.త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
యాక్టివేట్ చేసుకోవడం ఎలా? ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాగానే Settings > Notifications > Reminders ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకుని దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







