ఢిల్లీ డిప్లమాటిక్ ఛారిటీ బజార్లో మెరిసిన కువైట్.!!
- December 09, 2024
కువైట్: భారతదేశంలోని కువైట్ రాయబారి మెషల్ ముస్తఫా అల్షెమాలి న్యూ ఢిల్లీలో ఒక ఛారిటీ బజార్లో పాల్గొన్నారు. అనంతరం మానవతా కార్యకలాపాలపై కువైట్ ప్రజల ఆసక్తిని తెలియజేశారు. భారతదేశంలో గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల సహకారంతో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మహిళా స్వచ్ఛంద సంస్థ కోసం న్యూఢిల్లీలో ఢిల్లీ కామన్వెల్త్ ఉమెన్స్ అసోసియేషన్ నిర్వహించిన వార్షిక ఛారిటీ బజార్లో కువైట్ పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో రాయబారి అల్షెమాలి తెలిపారు.
కువైట్ రాయబార కార్యాలయం కువైట్ జానపద దుస్తులతో పాటు కువైట్ ఆహారాలు, ఆహార సామాగ్రి, స్వీట్లు, పురాతన వస్తువులు, పరిమళ ద్రవ్యాలు వంటి అనేక విభిన్న స్థానిక ఉత్పత్తులను కలిగి ఉన్న పెవిలియన్ను ఏర్పాటు చేసిందన్నారు. వచ్చిన ఆదాయాన్ని పేద కుటుంబాలకు, అనాథాశ్రమాలకు మద్దతు ఇవ్వడం, పాఠశాల సామాగ్రిని అందించడం, వైద్య చికిత్సకు సహకారం అందించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఇవ్వనున్నట్లు అల్షెమాలి వెల్లడించారు. కువైట్లోని రాజకీయ నాయకత్వం, ప్రభుత్వం, ప్రజలు ఎల్లప్పుడూ మంచి పనులు చేయడంలో పేరుగాంచారని, ఆ మేరకు మానవతా ధార్మిక పనులు కువైట్ సమాజ ప్రత్యేక లక్షణాలలో ఒకటిగా మారాయని రాయబారి తెలిపారు. రాజధాని న్యూఢిల్లీలోని పెద్ద సంఖ్యలో అరబ్, విదేశీ రాయబార కార్యాలయాలు వారి ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఛారిటీ బజార్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







