‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది: హీరో అంకిత్ కొయ్య
- December 09, 2024
అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్‌గా ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ అనే చిత్రం రాబోతోంది. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సత్య ఈ చిత్రాన్ని నిర్మించారు.శ్రీ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..
నిర్మాత సత్య మాట్లాడుతూ.. ‘సెన్సిబుల్ మెసెజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. టీ హబ్‌లో ఈ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాం. కొత్త కంటెంట్‌ను టాలీవుడ్‌కు ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించాం. మా చిత్రానికి పెద్ద వాళ్లు కూడా సపోర్ట్ చేశారు. దీపక్ స్లమ్ డాగ్ మిలియనీర్‌కి పని చేశారు. సింగర్ కార్తీక్ పాట పాడారు. ట్రైలర్ తరువాత మా సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వచ్చింది’ అని అన్నారు.
హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘మనం అమృతం సీరియల్‌ను ఎంత ఎంజాయ్ చేశామో అంతలా మా సినిమాను ఎంజాయ్ చేస్తాం. కొన్ని సార్లు ఎదుటి వాళ్ల కష్టాలను, బాధల్ని చూసి మనం నవ్వుకుంటాం. హర్ష అనే కారెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన తరువాత డోర్ లాక్ అవ్వడం, ఇంట్లోనే పద్నాలుగు రోజులు ఉండటంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఈ సినిమా కథ. మెయిన్ ప్లాట్ రివీల్ చేశాం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. హర్ష చెప్పిన ఈ యూనిక్ పాయింట్ నచ్చింది. అలా మా జర్నీ ప్రారంభం అయింది. పూరి జగన్నాథ్ గారి వద్ద హర్ష పని చేశాడు. మా హీరోయిన్ శ్రియ అద్భుతంగా నటించారు. మరో తెలుగమ్మాయి నటన అందరినీ ఆకట్టుకోబోతోంది. సత్య వద్ద చాలా కొత్త కొత్త ఐడియాలుంటాయి. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మంచి వాళ్లకే ఇలా లేట్ అవుతుంటాయి. క్రిష్ గారి వల్లే మా చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్లోకి రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
సహ నిర్మాత నాగు మాట్లాడుతూ.. ‘సత్య ఆర్ట్స్ బ్యానర్‌లో కో ప్రొడ్యూసర్‌గా నేను రావడం ఆనందంగా ఉంది. అంకిత్, వెన్నెల కిషోర్ గారి ట్రాక్ బాగుంటుంది. కొత్త టీంను మీడియా ప్రోత్సహించాలి, ఆదరించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.
డైరెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ‘టీ హబ్‌లో ప్రొడక్షన్ కంపెనీ ఉందని తెలిసి షాక్ అయ్యా. అక్కడకు వెళ్లి మా నిర్మాత సత్యను కలిశాను. కొత్త వాళ్లమంతా కలిసి ఈ చిత్రాన్ని తీశాం. అంకిత్‌కి కూడా ఇది సోలో హీరోగా మొదటి చిత్రం. మా లాంటి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయండి. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







