ముఫాసా: ది లయన్ కింగ్ పై తన ఎక్సయిట్మెంట్ ని రిలిల్ చేసిన మహేష్ బాబు
- December 09, 2024
అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు.
మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్' డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది.
తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో అభిమానుల కోసం ఒక స్పెషల్ ట్రీట్. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. టాకా పాత్రకు హీరో సత్యదేవ్, టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.
ముఫాసా: ది లయన్ కింగ్‌కి వాయిస్ ఇవ్వడం గురించి మహేష్ బాబు తన ఎక్సయిట్మెంట్ ని షేర్ చేసుకున్నారు. “ముఫాసా ఇప్పటివరకు వచ్చిన అత్యంత పాపులర్ పాత్రలలో ఒకటి. ఇది నాకు ఒక డ్రీం కం ట్రూ భావిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్న పాత్రల్లో ఆయన ఒకరు. అతను తన కుటుంబాన్ని చూసుకునే విధానం అద్భుతం. నేను అతని పాత్రను చూడటానికి ఎదురుచూస్తున్నాను”అన్నారు మహేష్ బాబు.
“ఇది నిజంగా ఒక గౌరవం, ప్రతి తరానికి ఇష్టమైన పాత్ర ముఫాసా అని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తారని భావిస్తున్నాను. ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది, ఎ డ్రీమ్ కం ట్రూ” అని తన ఎక్సయిట్మెంట్ ని షేర్ చేసుకున్నారు.
ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







