'వివేకానికి ప్రాధాన్యత ఇవ్వండి'.. సిరియాకు యూఏఈ పిలుపు..!!
- December 10, 2024
యూఏఈ: సిరియన్ అరబ్ రిపబ్లిక్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. సిరియన్ ఐక్యత, సమగ్రతకు, అలాగే సోదర సిరియన్ ప్రజలకు భద్రత స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటిస్తుంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియా చరిత్రలో ఈ క్లిష్టమైన సమయంలో సిరియన్ జనాభాలోని అన్ని వర్గాల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే విధంగా వివేకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని సిరియన్ పార్టీలకు పిలుపునిచ్చింది.ఇంకా, సిరియా జాతీయ రాజ్యాన్ని, దాని సంస్థలను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
దాదాపు రెండు వారాల పోరాటం తర్వాత తిరుగుబాటుదారుల సైన్యం నాలుగు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నారు. డమాస్కస్‌లోకి ప్రవేశించగానే, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ డమాస్కస్ నుండి తెలియని గమ్యస్థానానికి వెళ్లినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు చెప్పారు. డమాస్కస్ ఇప్పుడు "బషర్ అల్ అస్సాద్ లేకుండా" ఉందని విదేశాలలో ఉన్న సిరియా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హదీ అల్-బహ్రా సిరియన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







