2035 నాటికి లైఫ్ సైన్స్ విభాగంలో 20వేల ఉద్యోగాలు..!!
- December 10, 2024
యూఏఈ: అబుదాబి రాబోయే దశాబ్దంలో లైఫ్ సైన్స్ రంగంలో 20వేల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మరియు అబులోని ఆరోగ్య శాఖ ఛైర్మన్ మన్సూర్ అల్ మన్సూరి తెలిపారు. 2035 నాటికి అబుదాబి దాని GDPకి 100 బిలియన్ల కంటే ఎక్కువ జోడిస్తుందని, లైఫ్ సైన్స్ రంగంలో 20వేల ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు అబుదాబి ఫైనాన్స్ వీక్‌లో ఆయన కీలక ప్రసంగం చేశారు. 2024లో 25 శాతం ఎక్కువ సంస్థలు, 180 కంటే ఎక్కువ క్లినికల్ అధ్యయనాలతో రాజధాని లైఫ్ సైన్స్ క్లస్టర్ విజయవంతంగా నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఇది అబుదాబిలోని ఆరోగ్య రంగానికి ప్రత్యేకత కలిగిస్తుందన్నారు. జీనోమ్, జీవనశైలి సమాచారాన్ని కవర్ చేస్తూ, తమ జనాభాలో డిజిటల్ జంటను సృష్టించడం ద్వారా తాము అత్యంత సమగ్రమైన డేటాను సృష్టించామన్నారు. యూఏఈ రాజధాని అత్యంత సమగ్రమైన రిఫరెన్స్ జీనోమ్‌తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద జీనోమ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







