ఆసియా మార్కెట్లలో పౌండ్ విలువ మరింత పతనం

- June 26, 2016 , by Maagulf
ఆసియా మార్కెట్లలో పౌండ్ విలువ మరింత పతనం

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక మొదలైన ఆ దేశ కరెన్సీ పౌండ్ విలువ పతనం ఇంకా కొనసాగుతోంది. బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక రికార్డు స్థాయిలో 31 ఏళ్ల కనిష్టానికి 10 శాతం పడిపోయిన పౌండ్ విలువ.. సోమవారం ఆసియా మార్కెట్లలో మరింత పతనమైంది. డాలర్లలో పౌండ్ మారకం విలువ 1.3365 వద్ద ట్రేడ్ అయ్యింది. అంటే ఒక పౌండుకు 1.34 డాలర్లు మాత్రమే వస్తాయన్న మాట. గత శుక్రవారంతో పోలిస్తే పౌండ్ విలువ 3 శాతం తగ్గినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక యూరోతో పోలిస్తే 1.2147తో ట్రేడ్ అయ్యింది.ఆసియా ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జపాన్ ప్రధాని షింజో అబె శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. కరెన్సీ మార్కెట్లు స్థిరంగా ఉండేందుకు అవసరమైనన్ని చర‍్యలు తీసుకుంటామని జపాన్ ఆర్థిక మంత్రి టరో అసో చెప్పారు. కాగా కొన్ని నెలల్లో పౌండ్ విలువ మరింత పతనమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com