డిసెంబర్ 19,20న ఇండియన్ స్కూల్ వార్షిక సాంస్కృతిక ప్రదర్శన..!!
- December 12, 2024
మనామా: ఇండియన్ స్కూల్ (ISB) వార్షిక కల్చరల్ ఫెయిర్ 2024 డిసెంబర్ 19 - 20 తేదీలలో ఇసా టౌన్‌లోని పాఠశాల ప్రాంగణంలో జరగనుంది. ఈ ఫెయిర్ సందర్భంగా పాఠశాల ఆడిటోరియంలో జరిగే యూత్ ఫెస్టివల్ అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఫెయిర్‌లో మొదటి రోజు సౌత్ ఇండియాకు చెందిన నటుడు, గాయకుడు వినీత్ శ్రీనివాసన్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. రెండవ రోజు సంగీతకారుడు, గాయకుడు ట్వింకిల్ దీపన్ కర్ నేతృత్వంలోని ఉత్తర భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఈ ఫెయిర్‌లో లైసెన్స్ పొందిన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి.
“ఫెయిర్ నుండి వచ్చే నిధులను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, సిబ్బందికి సంక్షేమ కార్యకలాపాలకు, పాఠశాల వనరులను మెరుగుపరచడానికి వినియోగిస్తారు. ఈ ఉదాత్తమైన ఉద్దేశ్యం కోసం నిధులను సేకరించేందుకు మీ మద్దతు మరియు సహకారాన్ని అందించవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అని ISB గౌరవాధ్యక్షుడు అడ్వకేట్ బిను మన్నిల్ వరుగీస్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







