కల్చరల్ ఫెస్టివల్.. దివ్యాంగుల ప్రతిభ ప్రదర్శనలు..!!
- December 14, 2024
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఇటీవల వికలాంగుల కోసం ఐదవ వార్షిక ఫెస్టివల్ ను నిర్వహించింది. దివ్యాంగుల పునరావాసం కోసం అల్-వఫా కేంద్రాల నుండి వారు తయారు చేసిన హస్తకళలు, చేతితో తయారు చేసిన వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని స్పోర్ట్స్ అండ్ యూత్ యాక్టివిటీస్ డైరెక్టర్ మొహమ్మద్ బిన్ అలీ అల్-ఫార్సీ మాట్లాడుతూ.. ఈ కార్యకలాపాలు దివ్యాంగులుగా ఉన్న వ్యక్తులకు కొత్త ఆశలను, అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. దివ్యాంగులలో సామాజిక కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సహాయంగా నిలుస్తుందని తెలిపారు. ఉత్తర అల్ బతినాలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోహర్‌లోని అసోసియేషన్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్, సోహర్, అల్-ఖబౌరా, అల్-సువైక్‌లోని వికలాంగుల పునరావాసం కోసం ప్రత్యేకించిన అల్-వఫా కేంద్రాల సహకారంతో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







