జెడ్డా బుక్ ఫెయిర్..పాల్గొంటున్న 22 దేశాల నుండి వెయ్యికి పైగా పబ్లిషర్స్..!!
- December 14, 2024
జెడ్డా: జెడ్డా సూపర్‌డోమ్‌లో ప్రారంభమైన జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024లో 22 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ ప్రచురణ సంస్థలు తరలివచ్చాయి. స్థానిక అంతర్జాతీయ ఏజెన్సీలు 450 పెవిలియన్‌లలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు జరిగే పుస్తకాల ఫెస్టివ్ ను సౌదీ సాహిత్యం, పబ్లిషింగ్, అనువాద కమీషన్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇది డిసెంబర్ 21 వరకు జరుగుతుంది. ప్రవేశం అందరికీ ఉచితం.
ఎగ్జిబిషన్‌లో 100 కంటే ఎక్కువ కార్యకలాపాలు, అనేక ఉపన్యాసాలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లతో సహా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2 -12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఇందులో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిషింగ్ డైరెక్టర్ జనరల్ డా. జెడ్డా బుక్ అబ్దులతీఫ్ అల్-వాసిల్ తెలిపారు. జెడ్డా బుక్ ఫెయిర్ 2024 దాని సందర్శకులను ప్రతిరోజూ ఉదయం 11 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 12 గంటల వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







