'లైలా' ఫిబ్రవరి 14, 2025న థియేట్రికల్ రిలీజ్
- December 16, 2024బోల్డ్, యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకునే మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ మూవీ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన 'లైలా' రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. మేకర్స్ గతంలో లైలా ఐ లుక్ ని రిలీజ్ చేయగా విశ్వక్సేన్ క్యారెక్టర్ అందరినీ మెస్మరైజ్ చేసింది.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున లైలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ జానర్ లో వస్తున్న సినిమాకి లవ్ సీజన్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం.
రిలీజ్ డేట్ పోస్టర్లో విశ్వక్సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్ తో కనిపించారు. చొక్కాతో తన ముఖాన్ని దాచుకున్నట్లు ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. 2025 న్యూ ఇయర్ రోజున లైలా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటీఫుల్ గా మేక్ఓవర్ అయ్యారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
లైలా విజువల్‌గా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా వుంటుంది. ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
త్వరలోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మేకర్స్ ప్రారంభించనున్నారు.
నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









