హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- December 17, 2024
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు.ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆమె ఐదు రోజుల పాటు బొల్లార్‌లోని రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. కాగా, రాష్ట్రపతి ముర్ము రేపు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







