హెడ్ ఆఫీస్ వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు బోల్తా..విషమంగానే కొందరి పరిస్థితి..!!
- December 17, 2024
యూఏఈ: ఖోర్ ఫక్కన్‌లో ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడిందని ప్రాథమికంగా షార్జా పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో73 మంది ప్రయాణికులకుపైగా ఉన్నట్లు తెలుస్తుంది. ఖోర్ ఫక్కన్ శివారు వాడి విషీ స్క్వేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారందరూ ఆసియాకు చెందినవారని, అజ్మాన్‌లో ఉన్న ఒక కంపెనీ కార్మికులని, తమ సెలవు రోజున కంపెనీ హెడ్ క్వార్టర్ ను సందర్శించడానికి, ఆ ప్రాంతంలో ఆహార పదార్థాల కోసం కొంత షాపింగ్ చేయడానికి అజ్మాన్‌కు వెళ్లారని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (KMCC)కి చెందిన సామాజిక కార్యకర్త సలీమ్ తెలిపారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. గాయపడ్డ కార్మికులు చాలా మంది షాక్‌లో ఉన్నారని, వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఫార్మాలిటీలు, పేపర్‌వర్క్ పూర్తయిన తర్వాత మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువస్తామని ఫుజైరాకు చెందిన మరో సామాజిక కార్యకర్త తెలిపారు.
బస్సు ప్రమాదం తర్వాత, దాదాపుగా గాయపడిన ప్రయాణీకులందరినీ సమీపంలోని ఖోర్ఫక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఇది క్రాష్ సైట్ నుండి నిమిషాల దూరంలో మాత్రమే ఉంది. బస్సు ప్రయాణీకులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొందరు వివిధ రకాలైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
2019లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సంవత్సరం, ఒమన్-దుబాయ్ బస్సు వాహనం పక్కన ఉన్న రహదారి ఎత్తు నియంత్రణ అవరోధాన్ని ఢీకొనడంతో 17 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!







