మాజీ భర్త నుంచి 1.5 బిలియన్ డాలర్లు డిమాండ్..మహిళకు జైలుశిక్ష..!!
- December 18, 2024
దుబాయ్: సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తను బెదిరించిన కేసులో జర్మనీకి చెందిన ఓ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. తన మాజీ భర్తను 1.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ 48 ఏళ్ల మహిళను దోషిగా నిర్ధారించింది.
అయితే, 2023 డిసెంబర్ 6, 7 తేదీల్లో జరిగిన ఈ సంఘటన వారి పిల్లల సంరక్షణ, ఉమ్మడిగా యాజమాన్యంలోని వ్యాపారంపై కుటుంబ, ఆర్థిక వివాదాల కారణంగా ప్రేరేపించబడిందని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. రికార్డుల ప్రకారం, నిందితురాలు టెలిగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా అనేక బెదిరింపు సందేశాలను పంపినట్లు గుర్తించారు. బెదిరింపులు, డిమాండ్‌లతో పాటు, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రతను నియంత్రించే యూఏఈ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసారు.
అయితే, ఆమెకు ముందస్తు నేర చరిత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆమె తదుపరి నేరాలకు పాల్పడకూడదని షరతు విధించి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. నేరానికి ఉపయోగించిన ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అప్పీల్ దాఖలు చేయగా, జనవరి 22న దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో విచారణకు రానుంది.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్







