తెలంగాణ వెల్ఫేర్ క్రికెట్ లీగ్-4 విజేత ప్రొఫెసర్ జయశంకర్ టీమ్
- December 18, 2024
దోహా: ప్రొఫెసర్ జయశంకర్ టీమ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ లీగ్-4(2024) విజేతగా నిలిచింది. కార్ల్సన్ vs ప్రొఫెసర్ జయ శంకర్ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ లీగ్-4లో 10 జట్లు పాల్గొన్నాయని TWA స్పోర్ట్స్ అండ్ యూత్ యాక్టివిటీస్ సెక్రటరీ మహమ్మద్ తాహా తెలిపారు.TWA వారి వివిధ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు కమ్యూనిటీ కోసం క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించిందన్నారుజ
గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 13 APL గ్రౌండ్స్ తుమామాలో జరిగింది.ఇందులో ప్రొఫెసర్ జయశంకర్ టీమ్ విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్, రన్నర్స్ అప్, టోర్నమెంట్ విన్నర్స్ కు అతిథులు బహుమతులు అందజేశారు.
మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ (అధ్యక్షుడు-TWA) ప్రొఫెసర్ జయశంకర్ బృందాన్ని అభినందించారు.బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ప్రజలు మంచి క్రికెట్లో పాల్గొంటున్నారని అభినందించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం, మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం అని అన్నారు.ఖతార్‌లోని తెలుగు కమ్యూనిటీల మధ్య క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి, మంచి సంబంధాలను పెంపొందించడానికి తుమామాలోని APL గ్రౌండ్స్‌లో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.గ్రాండ్ సక్సెస్ చేసిన పది జట్లకు స్పాన్సర్లు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహమ్మద్ షూబ్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు (క్రీడలు) దీపక్ శెట్టి (వైస్ ప్రెసిడెంట్ ICBF), ప్రత్యేక అతిథి దీపక్ చక్కలా (MC సభ్యుడు ISC), జియాద్ ఉస్మాన్ (మాజీ అధ్యక్షుడు ICBF), అతిథులుగా హరీష్ రెడ్డి ( అధ్యక్షుడు TKS), వెంకప్ప భాగవతుల (అధ్యక్షుడు AKV), మహమ్మద్ సయీద్ (ఛైర్మన్ APL), రాధిక యెముల (TWA ఉమెన్స్ వింగ్ హెడ్), మిస్టర్ ఇంతియాజ్ (యజమాని సబాబా లండన్ రెస్టారెంట్) పాల్గొన్నారు. వీరితోపాటు TWA వైస్ ప్రెసిడెంట్ రమేష్ పిట్ల , స్పోర్ట్స్ అండ్ టోర్నమెంట్ నిర్వాహకులు సయ్యద్ బఖర్, మహ్మద్ తాహా, మహమ్మద్ సలావుద్దీన్, మహమ్మద్ ఇక్బాల్, అతీఫ్, నాగరాజు TWA టీమ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









