ఈ ఆకుల్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగి గుండెకి ఎలాంటి ఢోకా ఉండదు
- December 19, 2024
కొలెస్ట్రాల్ అనేది జిడ్డుగా ఉండే ఓ పదార్థం.. దీని వల్ల ప్రమాదకరమైన గుండెనొప్పి, స్ట్రోక్ దగ్గర్నుంచి చాలా సమస్యలొస్తాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ దానంతట అదే పెరుగుతుంది. కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ కారణంగా కూడా వస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటాయి. అందులో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలస్ట్రాల్. ఇవి రెండు కూడా గుండె ఆరోగ్యంలో కీ రోల్ పోషిస్తాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అవు ఆర్టరీస్‌లో పేరుకుపోతాయి. దీని వల్లే గుండె సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యని తగ్గించుకునేందుకు మన డైట్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
శాచ్యురేటెడ్, ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో పాటు ఎలాంటి వర్క్ చేయకుండా ఉండడం వల్లా కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీని వల్లే సమస్యలొస్తాయి. కాబట్టి, సమస్యని ముందుగానే గుర్తించాలి. కొలెస్ట్రాల్‌ని ముందుగానే కంట్రోల్ చేసేందుకు కొన్ని మెడిసిన్స్‌లా పనిచేసే ఆకుకూరలు తీసుకోవాలి. వీటి వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
1. కరివేపాకుల్లో ఎన్నో గుణాలు ఉన్నాయి. వీటిని మనం కూరల్లో వాడడం వల్ల ఇందులోని గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కరివేపాకలు యాంటీ ఆక్సిడెంట్స ఉంటాయి. ఇవి మన బాడీలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీనిని వంటల్లో వాడడం వల్ల రుచి పెరగడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని మనం పొడిలా చేసి కూరల్లో వేయొచ్చు. పచ్చడి చేసుకుని తినొచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు.
2. వేపాకుల్లోని గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇవి నేచురల్ డీటాక్సీఫైయింగ్ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్‌ని ప్యూరిఫై చేయడమే కాకుండా, లివర్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. ఇవి రెండు కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. రెగ్యులర్‌గా వేపాకుల్ని జ్యూస్, సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే హై కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు.
3. పుదీనా మంచి రీఫ్రెషింగ్ టేస్ట్‌తో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. ఇందులోని మెంథాల్ జీవక్రియకి మేలు చేస్తుంది. దీనిని మీరు ఎలా అయినా మీ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. మింట్ టీ, రైస్ చేసుకోవడం, పుదీనా పచ్చడి, రసం, స్మూతీస్, సలాడ్స్ ఇలా ఎందులో అయినా పుదీనాని యాడ్ చేసుకుని తినొచ్చు.
4. మెంతి ఆకుల్లో కొలెస్ట్రాల్‌ని తిప్పికొట్టే గుణాలు ఉన్నాయి. ఇందులో సొల్యూబుల్ ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. ఇందులోని గుణాలు బాడీలోని మొత్తం కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. ఈ ఆకుల్ని మీరు కూరల్లో వాడొచ్చు. లేదా ఎలా అయినా తీసుకోవచ్చు.
5. తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండనే ఉంటుంది. ఇందులో ఎన్నో గుణాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం.. చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో తులసి ముందుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీనిని మీరు హ్యాపీగా మీ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. సలాడ్స్, టీలో వేసుకుని తులసి ఆకుల్ని ఆస్వాదించొచ్చు.
6. పుదీనా మంచి రీఫ్రెషింగ్ టేస్ట్‌తో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. ఇందులోని మెంథాల్ జీవక్రియకి మేలు చేస్తుంది. దీనిని మీరు ఎలా అయినా మీ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. మింట్ టీ, రైస్ చేసుకోవడం, పుదీనా పచ్చడి, రసం, స్మూతీస్, సలాడ్స్ ఇలా ఎందులో అయినా పుదీనాని యాడ్ చేసుకుని తినొచ్చు.
ఈ ఆకుల్ని తీసుకుంటూనే మీరు హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. ఎక్సర్‌సైజ్ చేయాలి. మంచి డైట్ తీసుకోవాలి. దీని వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!