21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
- December 19, 2024
హైదరాబాద్: డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రాండ్ గా క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి.ఇందు కోసం అందరూ సహకరించాలని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కోరారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ఇక్కడ రాష్ట్ర స్థాయి కమిటీ, జీహెచ్ఎంసీ అధికా రులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. బిషప్స్, ఫాదర్స్ ను క్రిస్మస్ విందు వేడుకకు మర్యాదపూర్వకంగా తీసుకొని రావాలని కోరారు. పోలీస్ బందోబస్తు పగడ్బందీగా ఉండాలని, వాహనాల పార్కింగ్ కోసం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







