ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో టిటిడి డైరీలు, క్యాలెండర్లు
- December 19, 2024
తిరుపతి: భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది.
2025 సంవత్సరానికి సంబంధించి 12-పేజీలు, 6-పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా టిటిడి ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణమండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.
టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది.
టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (http://www.tirumala.org, http://ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసేందుకు కల్పించిన సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







