'తిరుమల విజన్‌-2047'..ప్రతిపాదనలు ఆహ్వానించిన తితిదే

- December 19, 2024 , by Maagulf
\'తిరుమల విజన్‌-2047\'..ప్రతిపాదనలు ఆహ్వానించిన తితిదే

తిరుమల: ”స్వ‌ర్ణాంధ్ర‌ విజన్–2047″కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌తో “తిరుమల విజన్–2047” ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల‌ కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసింది.టీటీడీ బోర్డు నిర్ణయంఇటీవ‌ల తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ సమావేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాల‌ని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.

ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికత‌తో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలియ‌జేశారు.

తిరుమల ఆధ్యాత్మికం, పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భ‌క్తుల‌కు సౌకర్యాలు, వసతిని మెరుగుప‌ర్చాల‌ని ఆయన పిలుపునిచ్చారు.విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలుఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ తిరుమల‌ పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వ‌త‌మైన వ్యూహాలను అమ‌లు చేయ‌డం. ఉత్త‌మ‌మైన ప్ర‌ణాళిక‌లు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం. ప్ర‌పంచవ్యాప్తంగా తిరుమ‌ల‌ను రోల్ మోడ‌ల్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రయత్నిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com