ప్రతిష్టాత్మకమైన సంయుక్త పార్లమెంటరీ సంఘ సభ్యునిగా ఎంపీ బాలశౌరి
- December 19, 2024
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా లోక్ సభ మరియు అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు అనుకూలంగా 129 వ రాజ్యాంగ సవరణ నిమిత్తం నిన్న పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లు ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంగతి మనకు తెలిసినదే. ఈ విషయమై లోక్ సభలో చర్చలు జరిగిన అనంతరం నిర్వహించిన వోటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 వోట్లు పోల్ అయినాయి. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ను ఏకపక్షంగా నిరంకుశ ధోరణిలో ప్రవేశపెట్టారనీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ నేపధ్యంలో సదరు జమిలి ఎన్నికలకు సంబందించిన బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది.ఇప్పుడు సదరు ప్రతిష్టాత్మక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లో లోక్ సభ కు మూడు సార్లు ఎన్నికయిన సీనియర్ పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్లమెంటరీ పార్టీ లీడర్ వల్లభనేని బాలశౌరి ని సభ్యునిగా నియమించారు. 21 మండి సభ్యులుగా గల ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ 129 వ రాజ్యాంగ సవరణ బిల్లు పై విచారణ చేసి, తమ యొక్క సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి అందచేస్తుంది.
ఇటువంటి ప్రతిష్టాత్మక కమిటీలో చోటు కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి నారా చంద్రబాబుకు, జనసేన అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఎంపీ తన కృతజ్నతలు తెలిపారు.మిగిలిన సభ్యుల సహకారంతో కమిటీ నివేదిక తయారీలో తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







