ఆహార భద్రతకు దోహదం చేసే చక్కెర శుద్ధి ప్రాజెక్టు..!!
- December 22, 2024
మస్కట్: ప్రభుత్వ సంబంధిత సంస్థలు, ప్రైవేట్ రంగంలో భాగస్వాముల సహకారంతో ఆహార భద్రత రంగంలో అనేక ప్రాజెక్టులు, పెట్టుబడి అవకాశాలను ప్రారంభించనున్నట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆహార భద్రత డైరెక్టర్ జనరల్ సలీం బిన్ అబ్దుల్లా అల్ ఘుఫైలీ మాట్లాడుతూ.. ప్రకటించిన కీలక ప్రాజెక్టులలో చక్కెర శుద్ధి ప్రాజెక్ట్ కూడా ఉందని, ఇది సోహర్ పోర్ట్ వద్ద మొత్తం 18,000 చ.మీ. విస్తీర్ణంలో ఒమన్ సుల్తానేట్‌లో మొదటిదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఉత్పాదకత సంవత్సరానికి సుమారు ఒక మిలియన్ టన్నులు అని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ఐరోపాకు చెందినదని, అధిక-నాణ్యత చక్కెరను శుద్ధి చేసే అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటుందన్నారు. స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడి ఉత్పత్తులను పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు 91 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. సలాలా మిల్స్ కంపెనీ ప్రస్తుతం ఖాజాన్ ఎకనామిక్ సిటీలో ఫుడ్ ఇండస్ట్రీస్ సెంటర్ ప్రాజెక్ట్‌ను OMR 18.5 మిలియన్ల అంచనా వ్యయంతో..మొదటి దశలో రోజుకు 1.4 మిలియన్ ముక్కల ఉత్పత్తి సామర్థ్యంతో అమలు కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులలో సోహార్ పోర్టులో గోధుమ గోడౌన్లు నిర్మించడం, ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని 160,000 టన్నులకు పెంచడం లాంటివి ఉన్నాయని చెప్పారు. పశుగ్రాసం ఫ్యాక్టరీ విస్తరణ ప్రాజెక్టును కూడా ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









