భారతీయుల కిడ్నాప్.. నలుగురు పాకిస్తానీలకు జైలుశిక్ష, dh1 మిలియన్ ఫైన్..!!

- December 23, 2024 , by Maagulf
భారతీయుల కిడ్నాప్.. నలుగురు పాకిస్తానీలకు జైలుశిక్ష, dh1 మిలియన్ ఫైన్..!!

దుబాయ్: పోలీసు అధికారుల వలె నటించి ఇద్దరు భారతీయులను అపహరించి, దోచుకున్న కేసులో నలుగురు పాకిస్తానీలకు ఒక్కొక్కరికి రెండేళ్ళ జైలు శిక్ష, 1 మిలియన్ దిర్హామ్‌ల జరిమానాను దుబాయ్ కోర్టు విధించింది.  ఈ కేసు అల్ రఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మార్చి 29న చోటుచేసుకుంది. 

కోర్టు రికార్డుల ప్రకారం.. బాధితులను కిడ్నాప్ చేసేందుకు ఒక పాకిస్థానీ డ్రైవర్ మరో ముగ్గురు పాకిస్థానీలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మార్చి 29 ఉదయం బాధితులు పెద్ద మొత్తంలో నగదుతో దుబాయ్‌లోని గోల్డ్ సౌక్‌కు వెళుతుండగా, డ్రైవర్ వారి సమాచారాన్ని ముఠాకు అందించాడు. ముఠా నల్ల కియా వాహనంలో వారిని అనుసరించింది. నిందితులు అల్ మన్‌ఖూల్ సమీపంలో బాధితులను ఆపారు. అక్కడ ఇద్దరు నేరస్థులు పోలీసు అధికారులుగా నటిస్తూ బాధితులను వేర్వేరు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. వారిని అల్ నహ్దాకు తీసుకువెళ్లారు. అక్కడ ముఠా బాధితుల నుండి 1 మిలియన్ దిర్హామ్‌లు, రెండు మొబైల్ ఫోన్‌లు,  రెండు వాలెట్‌లను దొంగిలించారు. బాధితులు వెంటనే ఈ సంఘటనను అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.అయితే, ఐదో నిందితుడికి కేసులో సంబంధం లేదని తేలడంతో కోర్టు వదిలేసింది.  దుబాయ్ కోర్టు విధించిన జైలు శిక్ష ముగిసిన తర్వాత, వారిని దేశం నుండి బహిష్కరిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com