స్కామర్ల ఉచ్చులో కోల్డ్‌ప్లే అభిమానులు..టిక్కెట్ల పేరుతో భారీ దోపిడీ..!!
- December 23, 2024
యూఏఈ: అబుదాబిలో రాబోయే కోల్డ్‌ప్లే కాన్సర్టుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా కొందరు టిక్కెట్ స్కామ్‌ల బారిన పడుతున్నారు. వేల దిర్హామ్‌లను అభిమానులు కోల్పోయారు. కోల్డ్‌ప్లే మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ టూర్‌కు టిక్కెట్‌ల కోసం విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో స్కామర్‌లు రెచ్చిపోతున్నారు. కోల్డ్ ప్లే అభిమానులను నిలువున దోపిడీ చేస్తున్నారు.
దుబాయ్ నివాసి అయిన పి.ఎస్... ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు 400 దిర్హామ్‌లను కోల్పోయింది. అటువంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. "టికెట్‌మాస్టర్ వెబ్‌సైట్‌లో టిక్కెట్‌లను బదిలీ చేసిన తర్వాత టికెట్ ధరలో సగం ధరను, అంటే 400 దిర్హామ్‌లను వారి బ్యాంక్ ఖాతాకు పంపమని, ఆపై మిగిలిన మొత్తాన్ని ఆమెకు చెల్లించమని విక్రేత నన్ను అడిగాడు. అయితే, కొన్ని గంటల తర్వాత చెల్లింపు చేశాను. కొద్ది సమయానికే వారు తనను బ్లాక్ చేసారు.’’ అని వివరించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఎవరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేసిందో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టాలనే ఆశతో సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పి.ఎస్. పంచుకుంది. ఇలాగే కాన్సర్ట్ టిక్కెట్ కోసం ప్రయత్నించి మరో బాధితురాలు Dh1,500 కోల్పోయిందని పోలీసులు తెలిపారు.
బాధితుల కథనం ప్రకారం.. స్కామర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ IDని అందించడంతోపాటు నిజమైన Facebook ప్రొఫైల్ మాదిరిగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.
మరోవైపు యూఏఈలో కోల్డ్‌ప్లే కచేరీ టిక్కెట్‌ల అధికారిక విక్రయదారు అయిన టిక్కెట్ మాస్టర్(Ticketmaster) థర్డ్-పార్టీ విక్రేతల నుండి టిక్కెట్‌లను కొనుగోలు చేయడం గురించి దాని వెబ్‌సైట్‌లో హెచ్చరికలు జారీ చేసింది. సంగీత కచేరీ మొబైల్ ఎంట్రీని ఉపయోగిస్తుందని, అంటే టిక్కెట్లు హాజరైన వారి ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈవెంట్‌కు 72 గంటల ముందు మాత్రమే స్కాన్ చేయదగిన టిక్కెట్‌లు అందుబాటులో ఉంచబడతాయని స్పష్టం చేసింది.
మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా మిడిల్ ఈస్టర్న్ స్టాప్ అయిన అబుదాబిలో కోల్డ్‌ప్లే ప్రదర్శన జనవరి 11, 2025న ఉన్నది. కాగా, మరో మూడు కాన్సర్టుల కోసం అభిమానుల నుండి డిమాండ్ వస్తున్నది. దాంతో టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఇదే అదనుగా కొందరు అధిక మొత్తాలకు టిక్కెట్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది అభిమానులు స్కామర్ల చేతిలో చిక్కుకొని భారీగా మోసపోతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







