బకాయిలపై కొరడా ఝలిపించనున్న 'ఎతిసలాత్'

- July 09, 2015 , by Maagulf
బకాయిలపై కొరడా ఝలిపించనున్న 'ఎతిసలాత్'

బిల్లు చెల్లించవలసిన సమయం దాటిన 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనంతరం సేవలను నిలిపివేస్తామని, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ టెలికాం సర్వీస్ ప్రవైడర్ ఎతిసలాత్ అధికారులు తెలిపారు. ఈ నిబంధన, బిల్లు చెల్లించవలసిఉన్న తేదీ నుండి మొదలుకొని లాండ్ లైన్, ఇంటెర్నెట్ సర్వీస్ లు మరియు మొబైల్ ఫోన్లకు వర్తిస్తుందని వారు తెలిపారు.  ఈ విధంగా తాత్కాలికంగా నిలిపివేయబడే సేవలు, బిల్లు చెల్లించబడిన తరువాత పునరుద్ధరించబడతాయని తెలియచేశారు. ఐతే, గ్రేస్ పెరియడ్ అవధిని పెంచాలని ప్రజలు, వినియోగదారులు డిమాండు చేస్తున్నట్టు సమాచారం! ఎతిసలాత్ ప్రధాన పోటీదారు ఐన డ్యూ, బిల్లు చెల్లించడానికి ఇచ్చిన 10 రోజుల గ్రేస్ పెరియడ్ ను జూన్ 2011లో రద్దుచేయడం గమనార్హం!

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com