రొయ్యలతో ఫ్రైడ్ రైసు
- June 27, 2016
కావలసిన పదార్ధాలు :
రొయ్యలు : చిన్నవి అరకిలో , బాస్మతి బియ్యం : అరకిలో , గుడ్లు : రెండు , నూనె : 1 కప్పు , కేరెట్ ముక్కలు : అరకప్పు , బీన్సు ముక్కలు : అరకప్పు , ఉల్లిపాయ ముక్కలు : మిరియాల పొడి : అర టీ స్పూన్ప , పచ్చిమిర్చి ముద్ద : 1 టేబుల్ స్పూన్ , అల్లం వెల్లుల్లి ముద్ద : టేబుల్ స్పూన్ , ఉప్పు : సరిపడ , పసుపు : అర టీ స్పూన్ , పచ్చి బటాని : అరకప్పు , కరివేపాకు : రెండు రెమ్మలు , కొత్తిమిర : 1 కట్ట , సోయా సాస్ : 1 టీ స్పూన్
తయారుచేయు విధానం :
గుడ్లు పగలగొట్టి కాస్త ఉప్పు, మిరియాల పొడి కలిపి పక్కన పెట్టాలి. పచ్చి బటాని, బీన్సు, కేరెట్ ముక్కలు ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరుపోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి. గుడ్డు సొనను పొరుటులా వేసి పక్కన పెట్టాలి. రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి కొద్దిగా నీరుపోసి ఉడకపెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు బియ్యం కడిగి అన్నం కాస్త పదునుగా వండి పక్కనపెట్టాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి, కాగాక ఉల్లి ముక్కలు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చి వాసనా పోయే వరకు వేపి తరువాత ఉడకబెట్టిన రొయ్యలు వేసి వేపాలి. కాస్త వేగాక పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి, ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్, కేరెట్ ముక్కలు, బీన్సు ముక్కలు, పచ్చ బటాని వేసి కొద్దిగా వేపి ఉడికిన అన్నం వేసి కలిపి, గుడ్డు పోరుటుకూడా వేసి బాగాకలిపి కొత్తిమిర జల్లి స్టవ్ ఆపాలి. అంతే రొయ్యల ఫ్రైడ్ రైసు రెడి.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!









