UI సినిమాని ఇంత గొప్ప ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు: ఉపేంద్ర
- December 23, 2024
సూపర్ స్టార్ ఉపేంద్ర ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ 'UI ది మూవీ'. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి ఘన విజయం సాధించి అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తెలుగు, కన్నడలో ఫస్ట్ డే కంటే సెకండ్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరిగాయి. బుక్ మై షో లో 400K టికెట్స్ బుక్ అయ్యాయి. కన్నడ సినిమాలో ఈఏడాది వన్ అఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ మూవీగా UI నిలిచింది. తెలుగు కూడా బుకింగ్స్ అద్భుతంగా వున్నాయి. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా విజయవాడలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ..నేను అరుదుగా డైరెక్షన్ చేస్తాను. ఇరవై ఏళ్ల క్రితం చేసిన ఏ, ఉపేంద్ర సినిమాలని మీరు ఇంకా గుర్తుపెట్టుకొని అభిమానించారు. అంతే అభిమానం ఇప్పుడు యూఐ సినిమాపై చూపించడం చాలా ఆనందంగా వుంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఆడియన్స్ ఈ సినిమాకి స్టార్స్. మీపై నమ్మకం తో సినిమా చేశాను. మీ అందరికి కనెక్ట్ అవ్వడం ఆనందంగా వుంది. మీ ఆదరణ చూస్తుంటే రెగ్యులర్ గా నా డైరెక్షన్ లో సినిమాలు చేయాలనే ఉత్సాహం కలుగుతోంది. ఆడియన్స్ చాలా గొప్ప ఇన్వాల్ అయి సినిమా చూడటం చాలా థ్రిల్ ఇస్తోంది. తప్పకుండా అందరూ సినిమా చూడండి. ఇందులో రియల్ స్టార్స్ ఆడియన్సే' అన్నారు.
సహా నిర్మాత నవీన్ మనోహరన్ మాట్లాడుతూ..ఉపేంద్ర మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆయన విజన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఐదు భారతీయ భాషల్లో సినిమాని రిలీజ్ చేశాం, అన్ని చోట్ల రెస్పాన్స్ అద్భుతంగా వుంది. తెలుగులో షోస్ అన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. డే బై డే షోస్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసిన గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు' తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







