ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పూర్తి షెడ్యూల్‌

- December 24, 2024 , by Maagulf
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పూర్తి షెడ్యూల్‌

దుబాయ్‌: ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నమెంట్ కి సంబంధించి మొత్తం షెడ్యూల్ మంగళవారం ప్రకటించబడింది.ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19, 2025న పాకిస్తాన్‌కి చెందిన కరాచీలో ప్రారంభమవుతుంది.

ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడతాయి.ఈ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ గ్రూప్ Aలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు గ్రూప్ Bలో ఉన్నాయి.

భారతదేశం మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో ఆడనుంది.ఈ టోర్నమెంట్ లో భారత జట్టు పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు జరుగుతాయి.

భారతదేశం పాకిస్థాన్ తో అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. మరొక ముఖ్యమైన మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 22న లాహోర్‌లో జరగనుంది.

టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్ మార్చి 4, 5న జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది.ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీ-ఫైనల్ 1లో భారత్ అర్హత సాధించినట్లయితే, దుబాయ్‌లో ఆడుతుంది. పాకిస్తాన్ కూడా అర్హత సాధిస్తే, సెమీ-ఫైనల్ 2లో లాహోర్‌లో ఆడుతుంది.

2024 నుండి 2027 వరకు ICC ఈవెంట్స్‌లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com