తల్లితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
- December 25, 2024
అమరావతి: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన తల్లి చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. అంతకుముందు క్రిస్మస్ వేడుకల కోసం చర్చికి చేరుకున్న జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్, విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గురు, శుక్రవారం కూడా మాజీ సీఎం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొత్త సంవత్సరం క్యాలెండర్ను జగన్ ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







