గోవా సముద్రంలో బోటు బోల్తా...
- December 25, 2024
పనజి: క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్ల కోసం గోవా బీచ్‌కు పర్యటకులు పెరుగుతున్న వేళ బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ గోవాలోని కాలంగుటె బీచ్ అరేబియన్ సముద్రంలో పర్యాటకుల పడవ బోల్తా పడి ఒకరు మరణించారు.
20 మందిని రెస్య్కూ టీమ్ కాపాడింది. మరణించిన వ్యక్తిని 54 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. పడవ ప్రమాదంలో రక్షించిన 20 మందిని సమీప ఆసుపత్రికి తరలించామని, ప్రయాణికుల్లో ఇద్దరు మినహా పిల్లా పెద్దలందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తీర ప్రాంతానికి సుమారు 60 మీటర్ల దూరంలో పడవ బోల్తాపడిందని, దీంతో అందరూ సముద్రంలో పడిపోయారని లైఫ్ సేవింగ్ ఏజెన్సీ దృష్టి మెరైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
పడవలోని 13 మంది మహారాష్ట్రలోని ఖేడ్ నుంచి వచ్చారని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న 18 మంది లైఫ్ సేవర్లు ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారని, వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించి కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని చెప్పారు..
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







