గ్లోబల్ ద్రవ్యోల్బణం: యూఏఈలో ధరల నియంత్రణకు పటిష్ఠ యంత్రాంగం..!!

- December 26, 2024 , by Maagulf
గ్లోబల్ ద్రవ్యోల్బణం: యూఏఈలో ధరల నియంత్రణకు పటిష్ఠ యంత్రాంగం..!!

యూఏఈ: ఆహారాన్ని దిగుమతి చేసుకునే దేశం అయినప్పటికీ ప్రపంచ ద్రవ్యోల్బణం రేట్లు యూఏఈ కంటే ఎక్కువగా ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలో ముఖ్యంగా ప్రాథమిక ఆహార వస్తువులపై ధరల నియంత్రణకు పటిష్ఠ యంత్రాంగం ఉందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలను ట్రాక్ చేస్తుందని, వినియోగదారుల రక్షణకు తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. 

“ప్రపంచ ద్రవ్యోల్బణం స్థానిక (యూఏఈ) రేటు కంటే ఎక్కువగా ఉంది. స్థానిక ద్రవ్యోల్బణం గత మూడేళ్లలో 2.2 శాతం సగటు వార్షిక పెరుగుదలను చూసింది, అయితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 5-6 శాతానికి పెరిగింది, ”అని అల్ సలేహ్ చెప్పారు.  

యూఏఈ ఆహార ఉత్పత్తుల దిగుమతి దేశ కావడంతో.. అధిక షిప్పింగ్ ఖర్చులు, ప్రపంచ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ధరలు స్థానికంగా ప్రభావితమవుతాయని ఆయన అన్నారు. " మేము అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పెరుగుదలలన్నింటినీ పర్యవేక్షిస్తాము. అంతర్జాతీయ ధరల పెరుగుదల ధోరణికి వ్యతిరేకంగా స్థానిక మార్కెట్‌లో పెరుగుదల లేదని నిర్ధారించుకోవడానికి స్థానిక మార్కెట్‌లోని ధరలను నిరంతరం పర్యవేక్షిస్తాంము." అని ఆయన వివరించారు.

అక్టోబర్‌లో విడుదల చేసిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 'వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్' ప్రకారం.. గ్లోబల్ హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం 2024లో సగటున 5.8 శాతంగా ఉంటుందని తెలిపింది. 2023లో సగటున 6.7 శాతం తర్వాత 2025లో 4.3 శాతంగా అంచనా వేయబడింది. యూఏఈలో ద్రవ్యోల్బణం 2.3 శాతంగా అంచనా వేశారు. యూఏఈలో వినియోగదారుల ధరల సూచిక 2023లో సగటున 1.6 శాతంగా ఉంది.

నిత్యావసర వినియోగ వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు గతంలో ప్రవేశపెట్టిన ధరల నియంత్రణ విధానం స్థానంలో కొత్తది ప్రవేశపెట్టినట్టు అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు. కొత్త విధానం ప్రకారం.. యూఏఈ తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను పెంచడాన్ని నిషేధించింది. వంట నూనె, గుడ్లు, డైరీ, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ఇందులో ఉన్నాయి. వీటి ధరలను మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతితో మాత్రమే పెంచాల్సి ఉంటుంది. కొత్త మార్పులు జనవరి 2, 2025 నుండి అమలులోకి రానున్నాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com