దుబాయ్‌లో న్యూఇయర్: కుటుంబాలు, బ్యాచిలర్‌ల కోసం ప్రత్యేక జోన్‌లు..!!

- December 27, 2024 , by Maagulf
దుబాయ్‌లో న్యూఇయర్: కుటుంబాలు, బ్యాచిలర్‌ల కోసం ప్రత్యేక జోన్‌లు..!!

దుబాయ్‌: దుబాయ్‌లోని రెండు ఎమ్మార్ ప్రదేశాలలో న్యూఇయర్ వేడుకల కోసం ప్రత్యేక జోన్లను ప్రకటించారు. ఫ్యామిలీ, బ్యాచిలర్‌ల కోసం ప్రత్యేక కేటాయించినట్లు వెల్లడించారు. డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ హిల్స్ ఎస్టేట్ వద్ద ఈ ప్రత్యేక జోన్‌లు అందుబాటులో ఉంటాయి.

డౌన్‌టౌన్ దుబాయ్‌లో సందర్శకులు పెద్ద స్క్రీన్‌లు, బుర్జ్ పార్క్‌తో పాటు అద్భుతమైన ఫైర్ వర్క్స్, లైటింగ్, లేజర్ షోలు, ఫౌంటైన్‌ మ్యూజిక్ ను ఆనందించవచ్చు. దుబాయ్ హిల్స్ ఎస్టేట్ వద్ద DJ షోలు, స్క్రీన్‌లు, పిల్లల కోసం గేమ్స్, లైవ్ ఆర్ట్ షోలను చూడవచ్చు.  

డౌన్‌టౌన్ దుబాయ్‌లోని ఫ్యామిలీల కోసం ది బౌలేవార్డ్, యాక్ట్ 1 అండ్ 2, సౌత్ రిడ్జ్, ఓల్డ్ టౌన్, క్యాస్కేడ్ గార్డెన్‌ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. రూఫ్ హోటల్ పక్కన ఉన్న ఏరియా, బుర్జ్ విస్టా బ్యాక్, బుర్జ్ వ్యూస్ పక్కన, జబీల్ మాల్ సమీపంలో..విడా రెసిడెన్స్ వెనుక వంటి ప్రాంతాల్లో బ్యాచిలర్‌లకు ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేశారు.  ఎంట్రన్స్ కోసం గేట్‌లలో బుర్జ్ ప్లాజా వద్ద గేట్ 1, ఒపెరా గ్రాండ్ వద్ద గేట్ 2 అందుబాటులో ఉంటాయి. ఆరు గేట్‌లు ఫ్యామిలీల కోసం కేటాయించారు. మరోకదాన్ని రిజర్వేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

భద్రతను పర్యవేక్షించేందుకు 8,000 మందికి పైగా పోలీసు అధికారులతో సహా 10,000 మంది సిబ్బందిని, 33 భద్రతా క్యాంపులను ఏర్పాటు చేశారు. 200 అంబులెన్స్‌లు,  1,800 మంది వైద్య సిబ్బంది అత్యవసర సంరక్షణ కోసం సిద్ధంగా ఉంటారు.  షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్, బుర్జ్ ఖలీఫా స్ట్రీట్‌తో సహా ప్రధాన మార్గాలను డిసెంబర్ 31 సాయంత్రం 4 గంటల నుంచి మూసివేయనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com