నూతన సంవత్సర వేడుకల వేళ కఠిన ఆంక్షలు
- December 27, 2024
విశాఖపట్నం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విశాఖలో పోలీస్ రూల్స్ కఠినతరం చేశారు. ప్రతి ఏడాది విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా అంతకు మించే జరుగుతాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తం అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆంక్షలు విధించారు. విశాఖ నగరంలో అసాంఘిక కార్యక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, మద్యం విక్రయాలు, హోటళ్లు, క్లబ్స్, పబ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు పలు మార్గదర్శకాలు విడుదల చేశారు.
మార్గదర్శకాలు ఇవే..
డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకూ హోటళ్లు, క్లబ్స్, పబ్‌లకు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశించారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లకు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈవెంట్స్‌కు ముందస్తు అనుమతి తప్పని సరి చేశారు. అలాగే అన్ని ప్రవేశ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈవెంట్స్‌లో కళాకారుల దుస్తులు, డ్యాన్సులు, చర్యలు, మాటలతో సహా అన్ని సముచితంగా ఉండాలని ఆదేశించారు. అశ్లీలతలు అసలు ఉండొద్దని సూచించారు.శబ్థసాయిలు పరిమితంగా ఉండాలి.45 బెసిబెల్స్ కంటే దాటకూడదని పోలీసులు సూచించారు.నొవాటెల్ హోటల్ జంక్షన్, ఆర్కే బీచ్, భీమిలి, గాజువాక,పెందుర్తి పరిసర ప్రాంతాల్లో షీ టీమ్స్ ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు కలిగినా మహిళలు వెంటనే సంప్రదించాలని విశాఖ పోలీస్ కమిషరేట్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరు అతిక్రమించినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







