Dh100,000 గెలుచుకున్న 11 మంది.. గ్రాండ్ ప్రైజ్ నో క్లెయిమ్..!!

- December 29, 2024 , by Maagulf
Dh100,000 గెలుచుకున్న 11 మంది.. గ్రాండ్ ప్రైజ్ నో క్లెయిమ్..!!

యూఏఈ: యూఏఈ లాటరీ రెండవ డ్రాలో పదకొండు మంది యూఏఈ నివాసితులు ఒక్కొక్కరు Dh100,000 బహుమతిని గెలుచుకున్నారు.  ఈసారి కూడా, 100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ లేదా 1 మిలియన్ దిర్హామ్‌ల రెండవ బహుమతిని క్లెయిమ్ చేయడానికి విన్నింగ్ కాంబినేషన్‌తో ఎవరూ సరిపోలలేదని నిర్వాహకులు ప్రకటించారు. Dh100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ని గెలవడానికి 20, 11, 8, 17, 27, 23, 8 నంబర్లను వరుసగా సరిపోల్చాలి. రెండవ బహుమతిని గెలవడానికి ప్లేయర్స్ తప్పనిసరిగా మొదటి ఆరు సంఖ్యలతో సరిపోలాలి. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. జాక్‌పాట్‌ను గెలుచుకునే అవకాశం దాదాపు 8.8 మిలియన్లలో ఒక్కరికే ఉంటుంది.  డిసెంబర్ 14న జరిగిన మొదటి డ్రాలో కూడా గ్రాండ్ ప్రైజ్ ఎవరికి లభించలేదు.  

Dh100,000 గెలుచుకున్న విజేతల IDలు: BY4934604, AP1493831, CP6663669, BG3155379, CH5875638, CJ6088574, BF3045346. ఇక నాల్గవ బహుమతి Dh1000ని 183 మంది గెలుచుకున్నారు. 12,000 మందికి పైగా ప్రజలు 100 దిర్హామ్‌లు గెలుచుకున్నారు. డిసెంబర్ 28న రాత్రి 8:30 గంటలకు జరిగిన లైవ్ డ్రాలో మొత్తం 12,329 మంది విజేతలను ప్రకటించారు. తదుపరి డ్రా జనవరి 11న జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com