అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ఇ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- June 28, 2016
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ అడ్వైజరీ ప్రకారం అబుదాబీ ఎయిర్‌పోర్ట్స్, తమ ప్రయాణీకులకు వేసవి కాలం రద్దీ కారణంగా ముందస్తుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిందిగా సూచించింది. స్కూలు సెలవులు ప్రారంభమవడంతో 85,000 మందికి పైగా ప్రయాణీకులు అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణించే అవకాశం ఈ వారం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈద్ సెలవుల సందర్భంగా ఈ రద్దీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ప్యాసింజర్లు ఇ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనీ, స్మార్ట్ ట్రావెల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఇ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అబుదాబీ ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకులకు విజ్ఞప్తి చేసింది. చెక్ ఇన్ ప్రాంతాల్లో ఈ కౌంటర్స్‌ని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా ప్రాసెసింగ్ సమయాన్ని 70 శాతం వరకు తగ్గించుకునే వీలుంది. ఫ్లై దుబాయ్ ప్రయాణీకుల కోసం కొన్ని సూచనలు కూడా చేసింది. టైమ్‌ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం, ఆన్‌లైన్ చెకిన్ ద్వారా క్యూ లైన్ నుంచి జంప్ చేయడం, నిబంధనలకు తగ్గట్టుగా ప్యాకింగ్ చేసుకోవడం ఇవన్నీ సులువైన ప్రయాణానికి చిట్కాలంటూ ప్రయాణీకులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







