తైఫ్‌లోని అల్-హదా రోడ్ జనవరి నుండి మూసివేత..!!

- December 31, 2024 , by Maagulf
తైఫ్‌లోని అల్-హదా రోడ్ జనవరి నుండి మూసివేత..!!

రియాద్: తైఫ్ గవర్నరేట్‌లోని అల్-హదా రోడ్‌ను నిర్వహణ పనుల కోసం జనవరి 1 నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) ప్రకటించింది. నిర్వహణ పనులు రెండు నెలల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. రహదారి నాణ్యతను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రయాణికుల భద్రత, నాణ్యత లక్ష్యాలకు అనుగుణంగా నిర్వాహణ పనులను చేపట్టనున్నారు. అల్సైల్ అల్కబీర్ రోడ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని RGA వాహనదారులకు సూచించింది.

రోడ్స్ సెక్టార్ స్ట్రాటజీ లక్ష్యాలలో 2030 నాటికి రోడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఆరవ గ్లోబల్ ర్యాంకింగ్‌ను సాధించడం, రోడ్డు ప్రమాదాలను 100,000 మందికి 5 కంటే తక్కువకు తగ్గించడం, అంతర్జాతీయ రోడ్ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్ (iRAP)కు అనుగుణంగా భద్రతా చర్యలతో రహదారి నెట్‌వర్క్ ను అప్ గ్రేడ్ చేయనున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com