సౌదీ అరేబియాలో 28,806 ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ వాహనాలు రీకాల్..!!
- January 02, 2025
రియాద్: సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ 28,806 ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ వాహనాలను ( 2011 - 2019 మోడల్స్) రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. విండ్‌షీల్డ్ సపోర్ట్ల అవుట్ సైడ్ కవర్ల ఇన్‌స్టాలేషన్‌లో లోపం కారణంగా రికాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ లోపం వాహనదారులకు ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు తెలిపారు. అవసరమైన మరమ్మతులను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపింది. అల్ జజీరా వెహికల్స్ ఏజెన్సీస్ కంపెనీ, టోల్-ఫ్రీ నంబర్ (8007492222), మహ్మద్ యూసుఫ్ నఘి కంపెనీ, టోల్-ఫ్రీ నంబర్ (8001240218)లో సంప్రదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. రీకాల్ వాహన ఛాసిస్ నంబర్లను డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ రీకాల్ సెంటర్ (http://Recalls.sa) వెబ్సైట్ లో నమోదు చేశామని, అక్కడి నుండి వివరాలను తెలుసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







