దుబాయ్ పర్యాటక ఆదాయంలో వృద్ధి..పెరిగిన ధనిక దేశాల టూరిస్టులు..!!
- January 02, 2025
యూఏఈ: దుబాయ్‌లో పర్యాటకుల సందడి నెలకొన్నది. దాంతో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర రిటైల్ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. ఎమిరేట్ 2023లో 17.15 మిలియన్ల అంతర్జాతీయ ఓవర్‌నైట్ సందర్శకులను స్వాగతించింది. 2024లో మొదటి 10 నెలల్లోనే ఈ సంఖ్య 14.9 మిలియన్ దాటింది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఎనిమిది శాతం పెరుగుదలను నమోదుచేసింది. పశ్చిమ యూరప్ నుండి సందర్శకులు 2.939 మిలియన్లతో అగ్రస్థానంలో ఉన్నారు. దక్షిణాసియా 2.543 మిలియన్లు, GCC 2.217 మిలియన్లు, CIS, తూర్పు యూరోపియన్ దేశాల సందర్శకులు 2.075 మిలియన్లతో జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
దుబాయ్‌కి వచ్చే పర్యాటకులలో ఎక్కువ మంది సంపన్న దేశాల నుండి వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. "అధిక ఆదాయ వ్యక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అంతకుముందు సంవత్సరం కంటే 2024లో డిస్పోజబుల్ ఆదాయం కలిగిన పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. హోటల్ బుకింగ్‌లు పెరిగాయి. సుదీర్ఘ సెలవుల్లో ఎయిర్‌లైన్స్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి" అని దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ ఛైర్మన్, జవహారా జ్యువెలరీ సీఈఓ తౌహిద్ అబ్దుల్లా అన్నారు.
యూఏఈలో అంతర్జాతీయ సందర్శకుల వ్యయం మునుపటి సంవత్సరంలోని Dh175 బిలియన్లతో పోలిస్తే 2024లో 9.4 శాతం వృద్ధి చెంది Dh191.57 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక వ్యయాల్లో యూఏఈ ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో, సౌదీ అరేబియా తర్వాత ఈ ప్రాంతంలో రెండవ స్థానంలో నిలిచింది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాలకు మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ మాట్లాడుతూ.. కొనసాగుతున్న సెలవుల సీజన్లో పర్యాటకులు దుబాయ్‌లోని గోల్డ్ సౌక్, మీనా బజార్, కరామా వంటి ప్రాంతాలలో పర్యటిస్తున్నారని తెలిపారు. తద్వారా వ్యాపారం కూడా బాగా జరుగుతుందన్ని తెలిపారు. తమ సంస్థ మొత్తం పర్యాటక వ్యాపారంలో వృద్ధిని నమోదు చేసిందని జంబో ఎలక్ట్రానిక్స్ సీఈఓ వికాస్ చద్దా తెలిపారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF), వింటర్ టూరిజం సీజన్.. ఆఫ్-పీక్ పీరియడ్స్‌తో పోలిస్తే 30 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసిందన్నారు. గత కొన్నేళ్లుగా ఇండియా, రష్యన్, టర్కిష్ కస్టమర్లలో తమ ఉత్పత్తులకు ప్రాధాన్యత పెరుగుతోందని చద్దా తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







