ఇంటర్నేషనల్ ఫాల్కన్స్ అండ్ హంటింగ్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- January 02, 2025
దోహా: ఖతార్ ఇంటర్నేషనల్ ఫాల్కన్స్ అండ్ హంటింగ్ ఫెస్టివల్ (మార్మి 2025) 16వ ఎడిషన్ సీలైన్‌లోని మార్మి ప్రాంతంలో బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వరకు ఇది కొనసాగుతుంది. HE షేక్ జోవాన్ బిన్ హమద్ అల్-థానీ ఆధ్వర్యంలో.. ఖతారీ సొసైటీ ఆఫ్ అల్గన్నాస్ (AGQS) ద్వారా నిర్వహించే ఈ ఈవెంట్‌కు సోషల్ అండ్ స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ ఫండ్ (DAAM) మద్దతునిస్తుంది. ఇది హద్దాద్ అల్-తహద్ది పోటీతో ప్రారంభమైంది. దీనిలో 23 గ్రూపులు పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఈవెంట్‌లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఫర్ఖ్ షాహీన్ ఫాల్కన్‌లు గెలుపొందాయి.
మార్మి ఫెస్టివల్ చైర్మన్, మితేబ్ ముబారక్ అల్ ఖహ్తానీ మాట్లాడుతూ.. ఫాల్కన్రీ వారసత్వం కొత్త తరాల కోసం కొనసాగుతుందని తెలిపారు. ఖతారీ, గల్ఫ్ కమ్యూనిటీల నుండి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని తెలిపారు.
సెలైన్‌లోని మార్మి ప్రాంతంలో అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే పౌరులు, నివాసితులతో పాటు విదేశీ పర్యాటకులు ఫాల్కన్రీ వారసత్వం గురించి తెలుసుకోవడానికి ఈ ఫెస్టివల్ ఉత్తమ గమ్యస్థానంగా మారిందని, ఆర్గనైజింగ్ కమిటీ సందర్శకులకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తుందని అల్ నుయిమి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







