డిష్‌వాషర్లకు ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్డ్ ఉందా..? ఇక సౌదీలో తప్పనిసరి..!!
- January 02, 2025
రియాద్: సౌదీ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెంటర్ జనవరి 1 నుండి కింగ్‌డమ్‌లోని అన్ని విక్రయ కేంద్రాలలో డిష్‌వాషర్‌లకు ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్డ్ తప్పనిసరి చేసింది. డిష్‌వాషర్‌తో ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్డ్ లేబుల్ అందుబాటులో ఉందని నిర్ధారించుకున్నాకే ఈ రకమైన పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ కార్డ్ పరికరం రకం, మోడల్, బ్రాండ్, విద్యుత్ శక్తి వినియోగం, పరీక్ష స్పెసిఫికేషన్‌లు వంటి ప్రాథమిక డేటాను కలిగి ఉంటుంది.
డిష్‌వాషర్‌ల కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్డ్ గురించి అవగాహన పెంచడానికి కేంద్రం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ, సౌదీ స్టాండర్డ్స్ మెట్రాలజీ క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO), జకాత్, పన్నుకస్టమ్స్ అథారిటీ సంయుక్తంగా ఈ ప్రచారలంలో పాల్గొంటున్నాయి.
2014లో నేషనల్ క్యాంపెయిన్ ఫర్ రేషనలైజింగ్ ఎనర్జీ కన్సంప్షన్ పేరుతో కేంద్రం ప్రారంభించిన అవగాహన ప్రచార కార్యక్రమాలకు పొడిగింపుగా 11 రోజుల పాటు ఈ ప్రచారం సాగనున్నది. ఈసందర్భంగా ‘‘తాకద్" అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందు ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్డ్ వ్యాలిడిటీని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. తాకద్ (Taakad ) యాప్ అనేది సౌదీ అరేబియాలో నాణ్యత, ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్డ్ లేబుల్‌ల చెల్లుబాటును ధృవీకరించడానికి రూపొందించబడిన ప్రభుత్వ ఎలక్ట్రానిక్ యాప్.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







