ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
- January 02, 2025
హైదరాబాద్: 2025 నూతన సంవత్సర వేడుకల్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్, ఉప్పల్, పహాడి షరీఫ్, ఎల్బీనగర్, గూడూరు టోల్గేట్ వంటి ప్రాంతాల్లో స్వయంగా పాల్గొన్నారు.నూతన సంవత్సర వేడుకలు రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఉల్లాసభరితంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.కమిషనరేట్ పరిధిలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరియు సివిల్, ట్రాఫిక్, షి టీమ్స్ వంటి అన్ని విభాగాల పోలీసు సిబ్బంది అవిశ్రాతంగా పనిచేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.ఈ వేడుకల్లో మల్కాజ్ గిరి డీసీపీ పద్మజ, ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







