ఇద్దరు తెలుగు క్రీడాకారులకు అర్జున అవార్డులు
- January 02, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు అర్జున అవార్డులను కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగా ఇద్దరు తేజాలు ఎంపిక అయ్యారు.వారిలో అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తిలు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు. కాగా జివాంజి దీప్తి పారాలంపిక్స్‌లో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికి కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రీడా అవార్డులను ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!







