వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేయాలంటే....

- June 28, 2016 , by Maagulf
వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేయాలంటే....


వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేయాలంటే.. ఒక్క సౌందర్య సాధనాలపైనే ఆధారపడితే చాలదు. మీ రోజువారి జీవితంలో చిన్నపాటి మార్పులూ చేసుకోవాలి. ఎలాగంటే..
మంచినీళ్లు: శరీరానికి సరిపడా నీళ్లు తాగితే చాలినంత తేమ అందుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయివి. కాబట్టి దాహంతో సంబంధంలేకుండా నీళ్లు తరచూ తాగేలా చూసుకోవాలి.
మేకప్‌: సహజ అందాన్ని మెరిపించేందుకు మేకప్‌ తప్పనిసరే. అలాగని అతిగా వాడకూడదు. నిద్రపోయేముందు ముఖానికి వేసుకున్న మేకప్‌ తప్పనిసరిగా తీసేయాలి. దాంతో మేకప్‌కి దుమ్మూ, ధూళీ అతుక్కుపోయి చర్మగ్రంథులు పెద్దవి అవుతాయి.
ఎండ నుంచి రక్షణ: ఎండ వల్ల చర్మం సాగినట్లు అవుతుంది. చిన్నవయసులోనే ముడతలు మొదలవుతాయి. అందుకే బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. చలువ కళ్లద్దాలూ, టోపీ, స్కార్ఫ్‌లాంటివీ ఉపయోగించాలి.
వ్యాయామం: మీరెంత దృఢంగా ఉంటే అంత యౌవనంగా కనిపిస్తారు. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, రోజులో అరగంటైనా వ్యాయామం చేయండి.
నిద్ర: కంటినిండా నిద్రలేకపోయినా కళ్లు నిర్జీవంగా మారతాయి. నల్లని వలయాలూ వచ్చేస్తాయి. చర్మానికీ సరిపడా విశ్రాంతి లేక.. వార్థక్యపు ఛాయలు ముంచుకొస్తాయి. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. అప్పుడే తాజాగా కనిపిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com