ఫేక్ కాల్ స్కామ్‌.. 12 మంది ఆసియన్లకు జైలుశిక్ష..!!

- January 07, 2025 , by Maagulf
ఫేక్ కాల్ స్కామ్‌.. 12 మంది ఆసియన్లకు  జైలుశిక్ష..!!

మనామా: ఫేక్ కాల్ స్కామ్‌ లో 12 మంది ఆసియన్లు జైలు పాలయ్యారు. హై క్రిమినల్ కోర్ట్ ముఠా సభ్యులలో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 1,000 బిడి జరిమానా విధించింది.మిగిలిన ఎనిమిది మందికి మూడేళ్ల శిక్ష పడింది. మొత్తం 12 మంది జైలు శిక్షలు పూర్తయిన తర్వాత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

ఆర్థిక సంస్థల నుండి వచ్చే కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.  వారు వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేస్తున్నట్లు, బాధితుల నుండి రహస్య బ్యాంకింగ్ కోడ్‌లను తెలుసుకొని వారి ఖాతాల నుండి నిధులను తస్కరిస్తారని పేర్కొన్నారు. మోసాలను గుర్తిస్తే వెంటనే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ కు సమాచారం అందించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com