ఈక్వెస్ట్రియన్ క్రీడలపై ఒమన్ ప్రత్యేక శ్రద్ధ..!!

- January 07, 2025 , by Maagulf
ఈక్వెస్ట్రియన్ క్రీడలపై ఒమన్ ప్రత్యేక శ్రద్ధ..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఈక్వెస్ట్రియన్ క్రీడలకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది.  వివిధ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే రాయల్ హార్స్ దళానికి చెందిన జాకీలతో పాటు, రాయల్ హార్స్ రేసింగ్ క్లబ్, ఒమన్ ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ నిర్వహించే గుర్రపు పందాలలో పాల్గొనేవారికి ఇది నిరంతరం మద్దతునిస్తుంది. రాయల్ హార్స్ రేసింగ్ ఫెస్టివల్స్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌కి సాంస్కృతిక గుర్తింపును తెచ్చింది. ఈ ఫెస్టివల్స్ గుర్రపు పందెం పోటీల అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇందులో విజేతలు హిజ్ మెజెస్టి ది సుల్తాన్ కప్‌తో సహా ప్రతిష్టాత్మక ట్రోఫీలను అందుకుంటారు. ఈ సందర్భంగా గుర్రపు స్వారీ చేసే మగ , ఆడ వారి ప్రమాణాలను పెంపొందించడానికి కూడా సహాయపడతాయన్నారు. ఈ ఫెస్టివల్ ఒమానీ పౌరులు, గుర్రపు యజమానులు, కోచ్‌లు, జాకీలను రేసుల్లో పాల్గొనడానికి..పోటీ చేయడానికి ప్రోత్సహం అందిస్తాయి. హార్స్ యజమానులు స్వచ్ఛమైన అరేబియా గుర్రాలను పోటీలో పాల్గొనడానికి, ఒమన్ సుల్తానేట్‌లో గుర్రపు పెంపకంపై ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడతాయని ఒమన్ ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఛైర్మన్ సయ్యద్ ముంతీర్ సైఫ్ అల్ బుసైది పేర్కొన్నారు. ఈ పురాతన అరబ్ క్రీడ పరిరక్షణపై ఆసక్తిని కలిగి ఉన్న హిజ్ మెజెస్టి నుండి ప్రత్యేక మద్దతును పొందుతోందని తెలిపారు. ఒమన్ ట్రాక్‌లు ప్రపంచ ప్రమాణాలను కలిగి ఉన్నాయని, ప్రత్యేక కంపెనీలచే నిర్వహించబడుతున్న అల్ రహ్బా రేస్ ట్రాక్‌తో సహా సుల్తానేట్‌లో గుర్రపు పందాలు ఎల్లప్పుడూ నిరంతర ప్రశంసలను పొందుతాయని ఆయన తెలిపారు. రేసులను నిర్వహించే సిబ్బంది దాదాపు 100% ఒమానీలని, ఇది దేశానికి అదనపు విలువగా ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలలో ఒమన్ ప్రత్యేక హోదాను అందిస్తోందన్నారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com