బిజినెస్ బే నైఫ్ అటాక్ కేసు: జైలు శిక్షను సమర్థించిన దుబాయ్ కోర్టు..!!

- January 07, 2025 , by Maagulf
బిజినెస్ బే నైఫ్ అటాక్ కేసు: జైలు శిక్షను సమర్థించిన దుబాయ్ కోర్టు..!!

యూఏఈ: దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేసి, వారిని బెదిరించి, అభ్యంతరకరమైన పదజాలంతో దాడి చేసినందుకు నిందితుడికి మూడు నెలల జైలు శిక్షను దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. కేసు రికార్డుల ప్రకారం, ఈ సంఘటన ఏప్రిల్ 4, 2024న తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. మొదటి బాధితుడు బిజినెస్ బే ప్రాంతంలో పని ముగించుకుని తన కారులో ఎక్కాడని, నిందితుడి సహచరుడు వెనుక ప్రయాణీకుడి తలుపు తెరిచి అతని మెడ చుట్టూ పట్టుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు బాధితుడి పక్కన ఉన్న డ్రైవర్ సీటులోకి వచ్చి, తనపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వారిని వేరే చోటికి తీసుకెళ్లాలని కత్తితో దాడి చేశారు బాధితుడు తెలిపారు. అనంతరం కొందరు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా, కత్తితో దాడికి పాల్పడ్డాడు. మొదటి బాధితుడికి తొడపై కత్తిపోట్లు పడగా, రెండవ బాధితుడి చేతులకు కోతలు ఉన్నాయని వైద్య నివేదికలు వెల్లడించాయి. మూడో బాధితుడి ముఖంపై కత్తితో గాయమైంది. కాగా, విచారణ సమయంలో నిందితుడు తనపై వచ్చి ఆరోపణలను ఖండించారు. కేవలం తన స్నేహితుడికి సంబంధించిన వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. అయితే, బాధితుల వాంగ్మూలాలు, మెడికల్ రికార్డులతో సహా సమర్పించిన సాక్ష్యాలు అతడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు గుర్తించింది. నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, అనంతరం బహిష్కరించాలని విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com