. ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పొ సంస్థ సంసిద్ధత .
- June 28, 2016
ఏపీని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని గుయాంగ్ ప్రావిన్స్ వైస్ గవర్నర్‌ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.చైనాలో సీఎం చంద్రబాబు నాలుగో రోజు పర్యటనలో భాగంగా గుయాంగ్ సిటీ వైస్గవర్నర్ను కలిశారు. నీరు-చెట్టు విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనంతరం ఒప్పొ మొబైల్ ఉత్పత్తుల కంపెనీ వైస్ ప్రెసిడెంట్..ఎండీ, ప్లానింగ్ డైరెక్టర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. హార్డ్‌వేర్‌కు ఎంతో డిమాండ్ ఉందని, పాలనలో ఐటీ వినియోగంలో తాము ముందున్నామని చంద్రబాబు వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, 21 రోజుల్లో సింగిల్ డెస్క్ ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పొ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. 25వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఒప్పో హామీ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. జులైలో ఏపీలో పర్యటించి భూములు ఎంపిక చేసుకోవాలని ఒప్పొ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. చైనాలో అతిపెద్ద డేటా సెంటర్ చైనా యూనికామ్‌ను సందర్శించిన చంద్రబాబు దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్స్‌కాన్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ను చంద్రబాబు పరిశీలించి వారితో మాట్లాడారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







