య‌శ్ పుట్టిన రోజు.. ‘టాక్సిక్’ బర్త్‌డే పీక్ వీడియో వ‌చ్చేసింది.. గూస్‌బంప్స్..

- January 08, 2025 , by Maagulf
య‌శ్ పుట్టిన రోజు.. ‘టాక్సిక్’ బర్త్‌డే పీక్ వీడియో వ‌చ్చేసింది.. గూస్‌బంప్స్..

కేజీఎఫ్ చిత్రాల‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు యశ్. ఆయ‌న న‌టిస్తున్న మూవీ ‘టాక్సిక్‌’. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్‌ దాస్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కాగా.. నేడు హీరో య‌శ్ పుట్టిన రోజు (జ‌న‌వ‌రి 8). ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. అంతేకాదండోయ్ టాక్సిక్: బర్త్‌డే పీక్ అంటూ ఓ వీడియోను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో య‌ష్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. సిగార్ కాల్చుకుంటూ య‌ష్ కాసినోలోకి రాయ‌ల్‌గా ఎంట్రీ ఇస్తూ ఉండ‌డం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే ఓ హాలీవుడ్ స్టూడియోస్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం ఏప్రిల్ 10 న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రో రోజు క‌లుద్దాం..
ప్ర‌స్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నాన‌ని, పుట్టిన రోజు నాడు అందుబాటులో ఉండ‌న‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు య‌శ్ ఓ లేఖ‌ను రాశాడు.

‘నా పుట్టిన రోజు కోసం మీరంతా ఎంతో ఎదురుచూస్తుంటార‌నే విష‌యం నాకు తెలుసు. న‌న్ను క‌లిసి విషెస్ చెప్పాల‌ని అంతా ఆశ‌ప‌డుతుంటారు. అయితే.. ఈ సారి మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేక‌పోతున్నాను. మ‌న‌వంతా మ‌రో రోజు క‌లుద్దాం. మీ ప్రేమ‌, మ‌ద్ద‌తు ఎల్ల‌ప్పుడూ నాకు తోడుగా ఉంటాయి. మీరు సుర‌క్షితంగా ఉండ‌డ‌మే నాకు మీరిచ్చే బ‌హుమ‌తి అని.’ య‌శ్ ఆ లేఖ‌లో రాసుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com