విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- January 08, 2025
విశాఖపట్నం: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఎన్ఎస్ డేగలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు ఆత్మీయ స్వాగతం పలికారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వాగతం పలికారు.
రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో పాటు పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, ఈస్టర్న్ నేవల్ కమాండర్ వైస్ అడ్మిరల్ పెందార్కర్, రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, ఆర్.కృష్ణయ్య, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు), శాసన సభ్యులు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, అతిది గజపతి రాజు, కోండ్రు మురళీ మోహన్, కొణతాల రామకృష్ణ, కామినేని శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, శాసన మండలి సభ్యులు, విప్ వేపాడ చిరంజీవిరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







