‘జిన్సెంగ్’ ఉత్పత్తుల వినియోగంపై సౌదీ డ్రగ్ అథారిటీ హెచ్చరిక..!!

- January 10, 2025 , by Maagulf
‘జిన్సెంగ్’ ఉత్పత్తుల వినియోగంపై సౌదీ డ్రగ్ అథారిటీ హెచ్చరిక..!!

రియాద్:  సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA).. జిన్సెంగ్ (శాస్త్రీయ నామం- పానాక్స్ జిన్సెంగ్) అధిక వినియోగంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. దీనిని తరచుగా ప్రత్యామ్నాయ వైద్యంలో తీసుకుంటారని, శక్తి స్థాయిలను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సాధారణ టానిక్‌గా ఉపయోగిస్తారని తెలిపింది. అధిక మోతాదులో జిన్సెంగ్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు, అధిక రక్తపోటుతో సహా దుష్ప్రభావాలకు కారణం కావచ్చని SFDA ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు తగినంత భద్రతా డేటా లేనందున జిన్‌సెంగ్‌ కు దూరంగా ఉండాలని సూచించారు.  రక్తం పలుచబడే మందులు, మధుమేహం మందులు, గుండె మందులు, నిద్రలేమి మందులు, యాంటిసైకోటిక్స్ వంటి వివిధ మందులతో జిన్సెంగ్ అధిక మోతాదులో ఉంటుందని SFDA పేర్కొంది. వీటితోపాటు కాఫీ, టీ, గ్వారానా, మేట్ వంటి కెఫీన్-కలిగిన ఉత్పత్తులతో కూడా ఉంటుందన్నారు. సిఫార్సు చేయబడిన మోతాదు రూట్ 1-2 గ్రాములు, మూడు నుండి నాలుగు వారాలపాటు ప్రతిరోజూ మూడు నుండి నాలుగు సార్లు తీసుకుంటారు. ఒక టీస్పూన్ ఐదు గ్రాములకు సమానం అని తెలిపింది. SFDA మూలికలను ఔషధాల వలె వినియోగించాలని హెచ్చరించింది. ఏమైన సమస్యలను గుర్తిస్తే వెంటనే ఆరోగ్య రంగ నిపుణులను సంప్రదించాలని సూచించారు. మరింత సమాచారం కోసం, SFDA తన వెబ్‌సైట్: https://www.sfda.gov.sa/ar/informationlist/66327 లో నిషేధించిన మూలికలు, ఔషధ మొక్కలు, అలాగే నిషేధించబడిన కాస్మెటిక్ ఉత్పత్తుల సమగ్ర వివరాలు ఉన్నాయని వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com